మహబూబాబాద్ పట్టణంలో పర్యావరణానికి, ప్రజల ప్రాణాలకు హాని కలిగించే చైనా మాంజ విక్రయాలపై పోలీసులు నిఘా పెట్టారు. ఆదివారం పలు పతంగుల దుకాణాలలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి, చైనా మాంజ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చైనా మాంజ విక్రయిస్తున్నట్లు తెలిస్తే డయల్ 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.