యాసంగిలో పప్పు ధాన్యాల పంటలు సాగు చేయాలి: ఆత్మ చైర్మన్ నల్లు

5చూసినవారు
యాసంగిలో పప్పు ధాన్యాల పంటలు సాగు చేయాలి: ఆత్మ చైర్మన్ నల్లు
కురవిలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో, యాసంగిలో వరి పంటకు బదులుగా పప్పు ధాన్యాలు, నూనె గింజలు, ఉద్యాన పంటలు సాగు చేయాలని ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి రైతులకు సూచించారు. కురవి రైతు వేదికలో జరిగిన మిషన్ ఆత్మ నిర్భరత పల్సెస్ కార్యక్రమంలో, ఏడి మురళితో కలిసి రైతులకు 50 శాతం సబ్సిడీపై మినుములు పంపిణీ చేశారు. తక్కువ నీటితో పప్పుధాన్యాల సాగు సాధ్యమని, రైతులు ప్రభుత్వ సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, యూరియా వినియోగాన్ని తగ్గించి భూసారాన్ని కాపాడుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్