నెల్లికుదురు మండలంలోని వరంబండ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బుధవారం బడితండా సర్పంచ్ బిలావత్ ధనమ్మ అమృ ఉచిత ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని, విద్యార్థులకు ఏటా రెండు జతల దుస్తులు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనంలో గుడ్లు, రాగిజావ వంటి సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రావుల దేవేందర్, ఉపాధ్యాయులు రాజశేఖర్, CRP కవిత పాల్గొన్నారు.