శనివారం రాత్రి నుంచి మహబూబాబాద్ మండలం ఈదులపూసపల్లి సమీప ప్రాంతాల్లో కురుస్తున్న చిరు జల్లులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోతకు సిద్ధంగా ఉన్న పత్తి, మొక్కజొన్న పంటలు వర్షానికి దెబ్బతింటాయని, చేతికొచ్చిన పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోతున్నారు. ఈ అకాల వర్షం వారి ఆశలపై నీళ్లు చల్లింది.