గాంధీ జయంతి సందర్భంగా కురవిలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ
బీజేపీ ప్రభుత్వ విధానాలు దేశంలో మతసామరస్యానికి విఘాతం కలిగిస్తున్నాయని ఆరోపించారు. గాంధీజీ చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన స్ఫూర్తితో భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడేందుకు ప్రజాస్వామ్యవాదులు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కన్వీనర్ బుడమ వెంకన్న, బుర్ర సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.