
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ భావోద్వేగం (వీడియో)
పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు ఆపుకోలేక ప్రెస్ మీట్ మధ్యలోనే వెళ్లిపోయారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని, తాను ఎప్పుడూ పార్టీ బలోపేతానికే పనిచేశానని, వ్యతిరేకంగా పనిచేయలేదని ఆయన వెల్లడించారు. ఈ సంఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.




