పోలీస్ స్టేషన్‌లో SP తనిఖీ.. నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి

0చూసినవారు
పోలీస్ స్టేషన్‌లో SP తనిఖీ.. నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
మహబూబాబాద్ జిల్లా కురవి పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఐపీఎస్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని, మహిళలు, చిన్నారుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌తో పాటు గుడుంబా, గంజాయిపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని సూచించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, గ్రామాలను సందర్శిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుని మెరుగైన పోలీస్ సేవలు అందించాలని ఎస్పీ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్