మహబూబాబాద్ జిల్లాను హెచ్ఐవి రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర అత్యంత కీలకమని జిల్లా ఆరోగ్య, వైద్యాధికారి రవి రాథోడ్ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్ లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులు వాడుతూ, పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ఇది ఒక సామాజిక అంశమని, ప్రజలందరూ భాగస్వాములై ఎయిడ్స్ పై అవగాహన కల్పించాలని ఆయన కోరారు.