కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలి: విజయసారథి

1595చూసినవారు
కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలి: విజయసారథి
ఇండ్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు, పట్టాల సాధన కోసం జూలై 1న కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని మహబుబాబాద్ సీపీఐ జిల్లా కార్యదర్శి బి. విజయసారథి పిలుపునిచ్చారు. వేలాది మంది నిరుపేదలు అద్దెలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వమే ఇంటి స్థలాలు పంచాలని డిమాండ్ చేశారు. ఇటీవల అక్రమంగా గుడిసెలు కూల్చి పేదలను నిరాశ్రయులను చేశారని ఆయన మండిపడ్డారు. వందలాది మందితో కలెక్టరేట్ ముట్టడి నిర్వహిస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్