బైక్‌ను ఢీకొట్టిన అడవి పంది ఇద్దరికి తీవ్ర గాయాలు

1చూసినవారు
బైక్‌ను ఢీకొట్టిన అడవి పంది ఇద్దరికి తీవ్ర గాయాలు
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో మంగళవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. కోనపురం గ్రామానికి చెందిన సుతారి సాయి చరణ్, బత్తలపల్లికి చెందిన రుషి అనే యువకులు బైక్‌పై బత్తలపల్లి నుండి గోపాలపురం వెళ్తుండగా, అకస్మాత్తుగా అడవి పంది అడ్డుగా వచ్చి వారిని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఇద్దరికీ గాయాలవడంతో వారిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్