రెండు వారాల క్రితం అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన గార్ల మండలానికి చెందిన భావన, మేఘన మృతదేహాలను శనివారం ఉదయం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి అంబులెన్స్ లో స్వగ్రామానికి తరలించారు. గార్లకు చేరుకున్న మేఘన మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషాద ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లా, మహబూబాబాద్ లో చోటుచేసుకుంది.