జమాండ్లపల్లి గ్రామంలో జనవరి 11, 2026న వడ్డెర సంఘం ఆధ్వర్యంలో రేనాటి యోధుడు వడ్డే ఓబన్న జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డెర కులస్తులు మాట్లాడుతూ, ఓబన్న బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా చేసిన స్వాతంత్ర్య పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని, ఆయన చిన్నతనం నుంచే సమాజం కోసం, జాతి స్వాతంత్ర్యం కోసం నిరంతరం పోరాడారని తెలిపారు. ఓబన్న నేతృత్వంలో ఆయన సొంత గ్రామంలో గ్రామస్థులకు సైనిక శిక్షణ, వ్యూహరచన అందించారని పేర్కొన్నారు.