ఆరోగ్య మందిరం మూత: గ్రామస్తుల ఆందోళన

3చూసినవారు
మహబూబాబాద్ జిల్లా జమండ్లపల్లి గ్రామంలోని ప్రభుత్వ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం కొన్ని నెలలుగా మూతపడటంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఈ కేంద్రంలో సాధారణ వ్యాధులకు ఉచితంగా చికిత్స, మందులు లభించేవి. వైద్యులు, సిబ్బంది హాజరు కాకపోవడంతో, కలుపు మొక్కలతో నిండిపోయిన భవనం నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. చిన్నపాటి జబ్బులకూ దూరపు ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది. ప్రయాణ ఖర్చులు, సమయం వృథాతో పాటు అత్యవసర చికిత్స అందక ప్రమాదం పెరుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఆసుపత్రిని పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్