పదవ తరగతి విద్యార్థుల డబ్బుల వసూళ్లు ఎవరికి చేరాయి?

7చూసినవారు
పదవ తరగతి విద్యార్థుల డబ్బుల వసూళ్లు ఎవరికి చేరాయి?
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో విద్యాశాఖ అధికారిపై అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థుల వద్ద నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. స్థానికంగా ఎగ్జామ్ సెంటర్ల వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల కథనాల ప్రకారం, ఒక్కో విద్యార్థి నుండి రూ. 300 నుంచి రూ. 500 వరకు వసూలు చేసినట్లు సమాచారం. పరీక్షలు సజావుగా రాయాలంటే తప్పనిసరిగా డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై మరిన్ని సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you