పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య

3చూసినవారు
పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని భూపతి పేట గ్రామానికి చెందిన గాజబోయిన ఎల్లమ్మ (54) మంగళవారం రాత్రి కడుపునొప్పి భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతున్న ఆమె, శస్త్రచికిత్స చేయించుకున్నా తగ్గకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్సై గిరిధర్ రెడ్డి తెలిపారు. బుధవారం మృతురాలి కొడుకు క్రాంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్