
గంగారం: నూతన ఎంపీడీఓకు సన్మానం
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో నూతన ఎంపీడీఓగా బాధ్యతలు స్వీకరించిన వైష్ణవి (గ్రూప్-1)ని మంగళవారం మాజీ మండల ప్రజా పరిషత్ ప్రెసిడెంట్ సువర్ణపాక సరోజన జగ్గారావు సన్మానించారు. ఇది ఆమెకు ఇదే మొదటి పోస్టింగ్. ఈ నేపథ్యంలో మర్రిగూడెం గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఎంపీడీఓను మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానించారు.




































