మేడారం జాతర ముగిసి, భక్తులు తిరుగు ప్రయాణమవుతుండగా, మేడారం నుంచి తాడ్వాయి వరకు సుమారు 14 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 8 గంటలుగా వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంబులెన్స్‌లు, ప్రైవేటు వాహనాలు కూడా చిక్కుకుపోవడంతో చిన్నపిల్లలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నిస్తున్నా, వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.