ములుగు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకన్ ఆధ్వర్యంలో రికవరీ చేసిన 15 మిస్సింగ్ మొబైల్ ఫోన్లను వాటి అసలైన యజమానులకు అందజేశారు. ఈ సందర్భంగా మొబైల్ ఫోన్ పోయిన వెంటనే CEIR పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయడంతో పాటు సమీప పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ఇలా చేస్తే పోయిన మొబైల్ ఫోన్లను త్వరితగతిన గుర్తించి తిరిగి అప్పగించే అవకాశం ఉంటుందని తెలిపారు.