మేడారం జాతరకు 70 కొత్త ట్రాన్స్ ఫార్మర్లు: సీఎండి

2చూసినవారు
మేడారం జాతరకు 70 కొత్త ట్రాన్స్ ఫార్మర్లు: సీఎండి
ములుగు జిల్లా మేడారం జాతరలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా కోసం 70 కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తెలిపారు. బుధవారం మేడారంలో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. నార్లాపూర్లోని 33/11కేవీ సబ్ స్టేషన్ అందుబాటులోకి వచ్చిందని, జంపన్నవాగు వద్ద ఆరు టవర్లను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. వనదేవతల గద్దెల వద్ద నిరంతర విద్యుత్ కోసం కవర్డ్ కండక్టర్ను ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్