ములుగు జిల్లా ఏటూరునాగారంలోని 12 గ్రామపంచాయతీల్లో మొదటి విడతలో దాఖలైన నామినేషన్లకు ఆదివారం అధికారులు స్కూటీని నిర్వహించారు. 12 గ్రామపంచాయతీల్లో 77 సర్పంచులు, 114 వార్డులకు గాను 278 మంది పోటీలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. స్కూటీనిలో ఎలాంటి పొరపాట్లు లేవని, అన్ని దరఖాస్తులు చెల్లుబాటు అయ్యాయని మండల పరిషత్ అధికారులు తెలిపారు.