ఏటూరునాగారంలోనే జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయాలి.. సుకుమార్

7చూసినవారు
ఏటూరునాగారంలోనే జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయాలి.. సుకుమార్
ములుగు జిల్లాకు మంజూరైన అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ఏటూరునాగారంలోనే ఏర్పాటు చేయాలని తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు రాజమల్ల సుకుమార్ ప్రభుత్వాన్నిమంగళవారం కోరారు. జీవో 59 ద్వారా మంజూరైన కొత్త కోర్టుల్లో ములుగుకు ఒకటి కేటాయించారని, అయితే వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెం, మంగపేట, తాడ్వాయి మండలాల ప్రజలు న్యాయం కోసం ములుగుకు 60 నుండి 120 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని ఆయన తెలిపారు. అన్నింటికీ కేంద్ర స్థానమైన ఏటూరునాగారంలో కోర్టును ఏర్పాటు చేస్తే కక్షిదారులు, మహిళలు, వృద్ధులు మరియు పోలీసులకు ప్రయాణ భారం తగ్గి త్వరగా న్యాయం అందుతుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్