ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో నూతన న్యాయస్థానం ఏర్పాటు చేయాలని సర్పంచ్ కాకులమర్రి శ్రీలత రాష్ట్ర ప్రభుత్వాన్నిశుక్రవారం కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 200 కొత్త అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ అవకాశాన్ని ఏటూరు నాగారానికి కల్పించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంత్రి ధనసరి అనసూయ సీతక్కను కలిసి వినతిపత్రం అందజేశారు. ఏటూరునాగారంతో పాటు తాడ్వాయి, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం మండలాల ప్రజలకు న్యాయ సేవలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని, గిరిజన ప్రాంతాల ప్రజలకు స్థానికంగానే కోర్టు ఏర్పాటు చేయాలని శ్రీలత పేర్కొన్నారు.