మేడారం జాతర నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని భక్తులు ఆరోపిస్తున్నారు. జాతర కోసం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టామంటూ గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం, RTC, రెవెన్యూ, ITDA, దేవదాయశాఖ, విద్యుత్, పోలీసు శాఖల మధ్య సమన్వయం లోపించడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. జాతరలో కరెంట్ కట్, షాపుల లూటీ, క్యూలైన్ ఫెయిల్యూర్, భక్తులపై పోలీసు దాడులు, పూజారులతో ఘర్షణ వంటి అనేక ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు.