ఉమ్మడి వరంగల్ జిల్లా, ములుగులో ఈనెల 27న 'అమ్మకు అక్షరమాల' మూల అక్షరాస్యత, సంఖ్యాజ్ఞాన మదింపు పరీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ హేమంత్ బోర్కడే తెలిపారు. 15 ఏళ్లు పైబడిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో జాతీయ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరుగుతుంది. జిల్లాలోని 171 జీపీలు, 20 పట్టణ వార్డుల పరిధిలో 3,597 మంది ఈ పరీక్షకు హాజరవుతారు.