ఎదురుదురుగా ఆటోలు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు

3చూసినవారు
ఎదురుదురుగా ఆటోలు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు
మంగపేట మండలంలోని బ్రాహ్మణపల్లి చెక్ పోస్టు పెరకలకుంట సమీపంలో బుధవారం రాత్రి రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇసుక లారీల లైట్ల వెలుతురులో రోడ్డు కనిపించక వేగం అదుపుతప్పి ఆటోలు ఢీకొన్నాయని స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్