మేడారం జాతరలో మగబిడ్డ జననం

2చూసినవారు
మేడారం జాతరలో మగబిడ్డ జననం
మల్కాజిగిరి జిల్లా మౌలాలి గాంధీనగర్కు చెందిన రజిత అనే గర్భిణీ కుటుంబ సభ్యులతో కలిసి మేడారం జాతరకు వచ్చి అమ్మవార్లను దర్శించుకుంది. దర్శనం తర్వాత ఆమెకు అకస్మాత్తుగా పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే 108కి సమాచారం అందించగా, మేడారం జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య శిబిరానికి గర్భిణీని తరలించారు. వైద్యుల సేవలతో రజిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్