ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలానికి చెందిన బొల్లె భాస్కర్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు అశోక్ బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ, జిల్లాలో పార్టీ పటిష్ఠతకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పునరుద్ఘాటించారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన మంత్రి సీతక్కకు, డీసీసీ అధ్యక్షుడు అశోక్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.