మల్లంపల్లి మండల ఏర్పాటు చరిత్రను వక్రీకరించవద్దని బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు శ్రీనివాస్ అన్నారు. 2023 సెప్టెంబర్ 23న బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాథమిక గెజిట్ జారీ చేసి, అభ్యంతరాలు స్వీకరించినట్లు తెలిపారు. 2024 నవంబర్ 28న తుది గెజిట్‌తో పది గ్రామాలతో మండలం ఏర్పడిందని, దీనిని కాంగ్రెస్ తమ ఘనతగా చెప్పుకోవడం సరికాదని, ఇది ప్రజల ఆకాంక్ష అని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధికి నిధులు కేటాయిస్తే స్వాగతిస్తామని శ్రీనివాస్ తెలిపారు.