కేసీఆర్ పథకాలకు కృతజ్ఞతగా బీఆర్ఎస్ పాలాభిషేకం, చీరల పంపిణీ

1చూసినవారు
కేసీఆర్ పథకాలకు కృతజ్ఞతగా బీఆర్ఎస్ పాలాభిషేకం, చీరల పంపిణీ
ములుగు జిల్లా మల్లంపల్లిలో శుక్రవారం మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు కృతజ్ఞతగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు నేతృత్వంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, 200 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, బడే నాగజ్యోతితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్