ములుగు జిల్లా కేంద్రంలోని
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మండల ముఖ్యకార్యకర్తల సమావేశంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి మాట్లాడుతూ కష్టపడే ప్రతి కార్యకర్తకు
బీఆర్ఎస్ అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజల మధ్య ఉంటూ పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. గత
బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, కార్యకర్తల సమస్యలు, గ్రామస్థాయి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.