అదుపుతప్పి చెట్ల లోకి దూసుకెళ్లిన బస్సు

6చూసినవారు
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొండపర్తి సమీపంలో బుధవారం అర్థరాత్రి ఆర్టీసీ బస్సు అదుపుతప్పి చెట్లలోకి దూసుకెళ్లింది. హనుమకొండ నుండి ఏటూరునాగారం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 28 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 8 మందికి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ అందుబాటులోకి రాకపోవడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.