తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 27న యాదగిరిగుట్టలో నిర్వహించనున్న సదస్సును విజయవంతం చేయాలని టఫ్ జిల్లా అధ్యక్షుడు పోరిక గోవింద్ నాయక్ పిలుపునిచ్చారు. శుక్రవారం వెంకటాపూర్ మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సదస్సుకు జిల్లాలోని ఉద్యమకారులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా చలో యాదగిరిగుట్ట' పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చంటి భద్రయ్య, సీనియర్ నాయకులు పల్నాటి రమేష్, మాజీ ఎంపీటీసీ గాజుల శ్రీనివాస్, జహీర్ పాషా, బోయిని సదయ్య తదితరులు పాల్గొన్నారు.