ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాలో ఎస్సై కమలాకర్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా 2K రన్నింగ్ నిర్వహించారు. ఈ రన్నింగ్‌ను పస్రా సీఐ దయాకర్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రజల్లో జాతీయ ఐక్యత, సామరస్యం, దేశభక్తి, సమైక్యత భావనతో కలిసి మెలిసి ముందుకు సాగాలని సీఐ దయాకర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల యువకులు, విద్యార్థులు, ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.