ములుగు జిల్లా, ఏటూరునాగారం మండలం మామిడిగూడెం గ్రామంలో ఎస్సీసీఎల్ రూ. 15 లక్షల సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన కంటైనర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను రాష్ట్ర మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మంత్రి ఏకరూప దుస్తులు, షూస్ పంపిణీ చేసి, వారితో కలిసి అల్పాహారం చేశారు.