మేడారం సమ్మక్క- సారలమ్మ మహా జాతర హుండీలను గురువారం ఉదయం హనుమకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో లెక్కించనున్నారు. జాతర సమయంలో గద్దెల ప్రాంగణంలో 827 హుండీలను ఏర్పాటు చేశారు. వాటిని ఇప్పటికే ఆర్టీసీ కార్గోలో హనుమకొండకు తరలించారు. నగదు, బంగారు, వెండి, విదేశీ కరెన్సీలను లెక్కించి, అక్కడే బ్యాంకులో డిపాజిట్ చేయనున్నారు. ఈ ఆదాయం నుంచి పూజారులకు ప్రభుత్వం వాటా ఇస్తుంది.