ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ బడే నాగజ్యోతి చొరవతో మంగపేట ప్రభుత్వ ఆసుపత్రికి బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు కుడుముల లక్ష్మీనారాయణ సిరంజీలను గురువారం అందజేశారు. ఆసుపత్రిలో కనీసం సిరంజీలు కూడా అందుబాటులో లేవని తెలుసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పేద ప్రజలు ఆధారపడే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సామగ్రి లేకపోవడం బాధాకరమని,
కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి అవసరమైన మందులు, పరికరాలను అందుబాటులో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు భూట్టో, దంతనపల్లి నరేందర్, గుడివాడ శ్రీహరి, సయ్యద్ అలీమోద్దీన్, గోర యాకుబ్ పాషా తదితరులు పాల్గొన్నారు.