జడ్పీహెచ్ఎస్ లో మరుగుదొడ్లకు డ్రైనేజీ అనుసంధానించాలి

3చూసినవారు
జడ్పీహెచ్ఎస్ లో మరుగుదొడ్లకు డ్రైనేజీ అనుసంధానించాలి
జడ్పీహెచ్ఎస్ మంగపేట పాఠశాలలో నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లకు వెంటనే డ్రైనేజీ పైప్‌లైన్ అనుసంధానించాలని కోరుతూ గుడివాడ శ్రీహరి, విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి మండల ప్రజావాణిలో ఎంపీడీఓ కు వినతిపత్రం అందజేశారు. నాలుగు నెలల క్రితం నిర్మాణం పూర్తయినా, అవుట్‌లెట్ డ్రైనేజీ అనుసంధానంపై గ్రామస్థుల అభ్యంతరాల వల్ల పనులు నిలిచిపోయాయని తెలిపారు. దీనివల్ల విద్యార్థులు, ముఖ్యంగా బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అధికారులు తక్షణమే గ్రామస్థులతో మాట్లాడి సమస్యను పరిష్కరించి, మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకురావాలని కోరారు.

సంబంధిత పోస్ట్