ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో అర్హులైన పట్టభద్రులు నమోదు కావాలి

1160చూసినవారు
ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో అర్హులైన పట్టభద్రులు నమోదు కావాలి
వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో అర్హులైన పట్టభద్రులు తప్పనిసరిగా నమోదు చేసుకునేలా అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ములుగు జిల్లా కలెక్టరేట్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా నమోదుపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. అర్హులైన గ్రాడ్యుయేట్లను గుర్తించి ఓటరుగా నమోదు చేయించేందుకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు.

సంబంధిత పోస్ట్