ములుగు జిల్లాలో బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. తెల్లవారుజామున గోదావరి నదిలో పవిత్ర స్నానాలు చేసి, ఆలయాల్లో 365 వత్తులతో కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.