మేడారం వనదేవతల దర్శనానికి వెళ్తున్న భక్తులకు తాడ్వాయి క్రాసింగ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న సుమారు 15 మంది భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.