కేయిన్స్ వనానికి ఫెన్సింగ్ ఏర్పాటు

0చూసినవారు
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని రామప్పలో ఉన్న 20 హెక్టార్ల కేయిన్స్ వనాన్ని జీవవైవిధ్య ప్రాంతంగా గుర్తించారు. దీని పరిరక్షణకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. ములుగు రేంజ్ ఆఫీసర్ అమృత మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం, రూ. 6 లక్షల వ్యయంతో ప్రస్తుతం 6 హెక్టార్ల విస్తీర్ణంలో సిమెంట్ పోల్స్‌తో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ అరుదైన రక్షిత ప్రాంతంగా గుర్తిస్తూ హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. రామప్పకు యునెస్కో గుర్తింపు లభించడంతో భూముల ధరలు పెరిగాయి. దీంతో కేయిన్స్ వనంపై కబ్జాదారుల కన్ను పడటంతో అటవీశాఖ అప్రమత్తమైంది.

సంబంధిత పోస్ట్