ములుగు జిల్లా ఏటూరునాగారం అభయారణ్యంలో కార్చిచ్చు కారణంగా జీడివాగు సమీపంలో అడవి తగలబడుతోంది. ఈ మంటల్లో విలువైన వృక్ష సంపద కాలి బూడిదవుతోంది. ఏటూరునాగారం, తాడ్వాయి మండలాల్లోని అభయారణ్యంలో ప్రతిరోజూ ఎక్కడోచోట అడవి కాలిపోతున్నా ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదని వన ప్రేమికులు ఫారెస్ట్ అధికారుల తీరుపై మండిపడుతున్నారు.