ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చే మార్పులు.. మీకు తెలుసా!
Mar 30, 2026, 02:03 IST/

ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చే మార్పులు.. మీకు తెలుసా!

Mar 30, 2026, 02:03 IST
ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 మొదలుకానుంది.  వివిధ అంశాల్లో కీలక మార్పులు రాబోతున్నాయి. ఐటీ యాక్ట్‌, 1961 స్థానంలో కొత్త ఆదాయ చట్టం ఏప్రిల్‌ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఇంతకుముందు పాన్‌కార్డు పొందాలంటే ఆధార్‌ సమర్పిస్తే సరిపోయేది. ఇకపై ఓటర్‌ ఐడీ, పాస్‌పోర్ట్‌, బర్త్‌ సర్టిఫికెట్‌ వంటి అదనపు పత్రాలు సమర్పించాలి. ఏప్రిల్‌ 1 నుంచి ఎల్‌పీజీ, విమాన ఇంధన ధరలను కేంద్రం సవరించే అవకాశముంది. రైలు ప్రయాణానికి 8 గంటల లోపు టికెట్‌ రద్దు చేస్తే ఎలాంటి రిఫండ్‌ రాదు. బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.10 లక్షలకు పైగా లావాదేవీలు చేస్తే పాన్‌ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.