మేడారం జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తపాలా శాఖ పవిత్ర గంగాజలం బాటిళ్లను అందుబాటులోకి తెచ్చింది. హనుమకొండ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వి.హనుమంతు ఆదేశాల మేరకు జంపన్న వాగు సమీపంలో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసి, ఒక్కో బాటిల్‌ను రూ.35 చొప్పున విక్రయిస్తున్నారు. వనదేవతల దర్శనానికి వచ్చే భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్ కోరారు.