ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పిడుగుపాటుకు 35 మేకలు, 3 ఆవులు మృతి చెందాయి. ఆలుబాక గ్రామ శివారులో మేతమిస్తున్న మేకలు పిడుగుపాటుకు గురికాగా, కొండాపురం బర్రెబొంద గ్రామంలో మూడు ఆవులు మరణించాయి. మేకలు కాస్తున్న ఇద్దరు వ్యక్తులు స్పృహ కోల్పోవడంతో వారిని వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన మేకల విలువ సుమారు మూడు లక్షల రూపాయలు, ఆవుల విలువ 50 వేల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.