పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం

6చూసినవారు
పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల నమోదు ప్రక్రియ వేగవంతమైంది. 01.11.2023 నాటికి డిగ్రీ లేదా సమానమైన డిప్లొమా పూర్తి చేసినవారు ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులు. అర్హులైన అభ్యర్థులు డిగ్రీ సర్టిఫికేట్, ఆధార్, ఓటరు ఐడీ, నివాస ధృవీకరణ పత్రాలు మరియు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో ఫార్మ్–18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తులను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా లేదా తహసీల్దార్ కార్యాలయంలో ఆఫ్‌లైన్ ద్వారా సమర్పించవచ్చని మంగపేట తహసీల్దార్ తోట రవీందర్ బుధవారం తెలిపారు. ఈ ప్రక్రియ ఉమ్మడి వరంగల్ జిల్లా, ములుగులో జరుగుతోంది.

సంబంధిత పోస్ట్