గట్టమ్మ తల్లిని దర్శించుకున్నహీరో నాని

0చూసినవారు
గట్టమ్మ తల్లిని దర్శించుకున్నహీరో నాని
సినిమా షూటింగ్‌లో భాగంగా హీరో  నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మంగళవారం ములుగు జిల్లాలో పర్యటించారు. ఉదయం 11 గంటల సమయంలో జిల్లా కేంద్రానికి సమీపంలోని గట్టమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న సినీ బృందానికి టీఆర్‌ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. నాని గట్టమ్మ తల్లికి పసుపు, కుంకుమ, చీర, సారే సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేడారంలోని సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకునేందుకు బయలుదేరారు.

సంబంధిత పోస్ట్