మేడారం సమ్మక్క-సారలమ్మలను రాష్ట్ర హైకోర్టు జడ్జిలు జస్టిస్ సృజన, జస్టిస్ రాణి శనివారం దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వనదేవతల గద్దెల వద్దకు చేరుకున్న వారికి ఆలయ పూజారులు, దేవాదాయ శాఖ అధికారులు ఘనస్వాగతం పలికారు. గద్దెలపై కొలువైన అమ్మవార్లకు వారు ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అధికారులు వారికి అమ్మవారి శేషవస్త్రం కప్పి, తీర్థప్రసాదాలను అందజేశారు.