ములుగులోని ఐడీఓసీలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్, టీ కేంద్రాన్ని సోమవారం మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావుతో కలిసి ప్రారంభించారు. క్యాంటీన్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించిన మంత్రి, మహిళా సంఘాల సభ్యులు స్వయం ఉపాధి ద్వారా వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.