హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ వై సతీష్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ శనివారం పరామర్శించారు. ఇటీవల సర్జరీ జరిగిన సతీష్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని
కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ములుగు జిల్లా పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య ఉన్నారు. ఈ సంఘటన ఉమ్మడి వరంగల్ జిల్లా, ములుగులో జరిగింది.